ఓపెనర్​గా వచ్చి నిరాశ పరిచిన రిషబ్​ పంత్​

20-11-2022 Sun 12:43
  • న్యూజిలాండ్ తో రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్
  • సత్తా చాటుతున్న యువ ఓపెనర్ ఇషాన్ కిషన్
  • 6.4 ఓవర్ల తర్వాత వర్షంతో ఆగిన ఆట
Rishab pant fails in 2nd t20 match
న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం మౌంట్ మాంగనుయ్ లో మొదలైన రెండో  మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఎడమచేతి వాటం బ్యాటర్లు, కీపర్లు అయిన ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ లను ఓపెనర్లుగా పంపించాడు. అయితే, యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకట్టుకోగా... సీనియర్ అయిన పంత్ మాత్రం నిరాశ పరిచాడు. 

13 బంతులు ఆడిన అతను ఒకే ఒక్క ఫోర్ కొట్టి ఆరు పరుగులకే ఔటయ్యాడు. ఆరో ఓవర్లో ఫెర్గూసన్ బౌలింగ్ లో టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ తోడుగా ఇషాన్ కిషన్ మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. దాంతో, ఏడో ఓవర్లోనే స్కోరు యాభై దాటింది. 6.4 ఓవర్లలో భారత్ 50/1 స్కోరు ఉన్న సమయంలో వర్షం రావడంత ఆట నిలిచిపోయింది. 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 28 పరుగులతో అజేయంగా ఉన్నాడు. సూర్యకుమార్ 5 బంతుల్లో ఆరు పరుగులు చేశాడు.