పాకిస్థాన్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిందా మృతి
- కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి చెందాడంటున్న పంజాబ్ పోలీసు వర్గాలు
- తాము కాల్చి చంపామంటున్న పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ గ్రూప్
- పలు ఉగ్రవాద కేసుల్లో నిందితుడిగా హర్విందర్
- 2008లో నేర ప్రపంచంలోకి అడుగు
హర్విందర్‌ను కాల్చి చంపామని గ్యాంగ్‌స్టర్ గ్రూప్ ప్రకటించినప్పటికీ పంజాబ్ పోలీసు వర్గాలు మాత్రం మరోలా చెబుతున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న హర్విందర్ 15 రోజుల క్రితం లాహోర్ ఆసుపత్రిలో చేరాడని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని చెబుతున్నారు. కాగా, రిందా తలపై జాతీయ దర్యాప్తు సంస్థ రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.
భారత జాతీయ భద్రతకు ముప్పుగా వాటిల్లిన హర్విందర్‌కు గ్యాంగ్‌స్టర్లు, పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. డ్రగ్స్, ఆయుధాలు వంటివి స్మగ్లింగ్ చేయడంలోనూ దిట్ట. హర్యానాలో ఈ ఏడాది మేలో ఓ వాహనం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లిన కేసులోనూ రిందాపై చార్జ్‌షీట్ దాఖలైంది. 2008లో అతడు నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు.