FIFA World Cup: సాకర్ ప్రియులను ఉర్రూతలూగించే ఫిఫా వరల్డ్ కు సర్వం సిద్ధం

All set for FIFA World Cup
  • నవంబరు 20 నుంచి డిసెంబరు 18 వరకు పోటీలు
  • ఖతార్ వేదికగా ఫుట్ బాల్ ప్రపంచకప్
  • మొత్తం 32 జట్లతో సాకర్ సంరంభం
  • తొలి మ్యాచ్ కు ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ
ఫిఫా వరల్డ్ కప్ కు సర్వం సిద్ధమైంది. నవంబరు 20 నుంచి డిసెంబరు 18 వరకు ఈ మెగా సాకర్ టోర్నీ ఖతార్ లో జరగనుంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ జట్లు తలపడనున్నాయి.

ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 32 జట్లు ఆడుతున్నాయి. ఒక్కో గ్రూప్ లో 4 జట్లు చొప్పున మొత్తం 8 గ్రూపులుగా విభజించారు. ఈ మ్యాచ్ లను భారత్ లో స్పోర్ట్స్ 18 చానల్లో ప్రసారం చేస్తున్నారు. 

కాగా, తొలి మ్యాచ్ కు ముందు భారీ స్థాయిలో ప్రారంభోత్సవం జరగనుంది. ఓపెనింగ్ సెర్మనీలో ప్రముఖ సంగీత బృందం బీటీఎస్ కు చెందిన జంగ్ కూక్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఓపెనింగ్ సెర్మనీకి దోహా సమీపంలోని బేత్ స్టేడియం వేదికగా నిలుస్తోంది.
FIFA World Cup
Qatar
Soccer

More Telugu News