చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడి.. ఇక, ఎప్పటికీ వివాహం చేసుకోనని శపథం చేసిన యువకుడు!
- అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఘటన
- అనారోగ్యం బారినపడి యువతి మృతి
- యువకుడిది స్వచ్ఛమైన ప్రేమంటూ ప్రశంసలు
మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథనా బోరా మృతి చెందింది. విషయం తెలిసిన బిటుపన్ తట్టుకోలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లాడు. అచేతనంగా ఉన్న ఆమెను చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. చివరికి అక్కడే అందరి ముందు మృతదేహానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలో మరెవరినీ పెళ్లి చేసుకోబోనని ప్రమాణం చేశాడు. ఇది చూసిన స్థానికులు బిటుపన్‌ది స్వచ్ఛమైన, నిజమైన ప్రేమ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.