47 ఏళ్ల సుస్మితా సేన్.. గుడ్ న్యూస్ చెబుతుందా?

19-11-2022 Sat 13:29
  • తనకు 47 ఏళ్లు వచ్చినట్టు ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటన
  • చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్టు వెల్లడి
  • దీని రాకను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు పోస్ట్
Sushmita Sen shares cryptic post on 47th birthday says I am thrilled to finally announce
తన వ్యక్తిగత బంధాలతో తరచూ వార్తల్లో ఉండే బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ మరోసారి అభిమానులను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పలకరించింది. తనకు 47 ఏళ్లు వచ్చినట్టు ప్రకటించింది. 

‘‘మొత్తానికి 47!!! 13 ఏళ్లుగా ఈ సంఖ్య నన్ను ఫాలో అవుతోంది. అపురూపమైన సంవత్సరం రాబోతోంది. చాలా కాలంగా ఇది నాకు తెలుసు. చివరికి దీని రాకను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాను!!! మిమ్మల్ని అభిమానిస్తున్నాను’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ పై సుస్మితా సేన్ పోస్ట్ పెట్టింది. దీన్ని లోతుగా పరిశీలిస్తే ఈ ఏడాది సుస్మిత ఏదైనా శుభవార్త చెబుతుందేమోనని అనిపిస్తోంది.

సుస్మిత మాజీ బోయ్ ఫ్రెండ్ రోహన్ రెడ్ హార్ట్ ఎమోజీతో రిప్లయ్ ఇచ్చాడు. ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీతోనూ సుస్మిత డేటింగ్ చేయడం తెలిసిందే. పెళ్లి చేసుకోకుండా పిల్లలను దత్తత తీసుకుని పోషిస్తూ.. మరోవైపు తన మనసుకు నచ్చిన వారితో సన్నిహితంగా ఉండేందుకు ఆమె వెనుకాడదన్న సంగతి తెలిసిందే.