France: భద్రతా మండలిలో భారత్ ఉండాలంటున్న ఫ్రాన్స్

  • భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు మద్దతు పలుకుతున్నట్టు వెల్లడి
  • కొత్త ఆర్థిక శక్తులను గుర్తించాలని సూచన
  • వాటికి తగిన ప్రాతినిధ్యంతో మండలి బలోపేతం అవుతుందన్న అభిప్రాయం
France Backs India and 3 Nations To Be Permanent UN Security Council Members

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఐదు దేశాలకే పరిమితం అయితే? అది మిగతా ప్రపంచానికి ఏ విధంగా ఆమోదనీయం అవుతుంది? భారత్ వంటి ఆర్థికంగా బలమైన దేశాలకు చోటు లేకుంటే ఎలా..? ఇప్పుడు ఈ విషయంలో ఫ్రాన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత్ కు బాసటగా నిలిచింది. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతు పలుకుతున్నట్టు ఫ్రాన్స్ మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

కొత్త ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న దేశాలను గుర్తించి, వాటికి మండలిలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఫ్రాన్స్ పేర్కొంది. ‘‘ఫ్రాన్స్ విధానం స్థిరమైనదని తెలుసు. నేటి ప్రపంచంలో భద్రతా మండలి కౌన్సిల్ లో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడు మండలి మరింత బలోపేతం అవుతుంది’’ అని ఐక్యరాజ్య సమితిలో ఫ్రాన్స్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాతాలీ బ్రోడ్ హర్ట్ శుక్రవారం ప్రకటన చేశారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్లీనరీ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడారు. భద్రతా మండలిలో 25 సభ్య దేశాలు ఉండాలన్న అభిప్రాయాన్ని వినిపించారు.

More Telugu News