వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్న రాజశేఖర్

18-11-2022 Fri 22:16
  • 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ థాంక్యూ మీట్
  • ముఖ్య అతిథులుగా రాజశేఖర్, జీవిత
  • వెబ్ సిరీస్ లు సినిమాలకు దీటుగా ఉంటున్నాయన్న రాజశేఖర్
  • స్టోరీ బాగుంటే వెబ్ సిరీస్ లో నటిస్తానని వెల్లడి
 Rajasekhar shows interest on web series
టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు. స్టోరీ, కంటెంట్ బాగుంటే వెబ్ సిరీస్ లో నటించేందుకు తాను సిద్ధమని రాజశేఖర్ వెల్లడించారు. సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్ లు ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. రాజ్ తరుణ్, శివానీ జంటగా రూపుదిద్దుకున్న 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ థాంక్యూ మీట్ కు రాజశేఖర్, జీవిత చీఫ్ గెస్టులుగా విచ్చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ సినిమా స్థాయిలో ఉందని కొనియాడారు. ఈ వెబ్ సిరీస్ ను సంజీవరెడ్డి ఆకట్టుకునే రీతిలో రూపొందించారని అభినందించారు. 

కాగా, రాజశేఖర్ గత వేసవిలో శేఖర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా, పవన్ సాదినేని దర్శకత్వంలో 'మాన్ స్టర్' చిత్రం చేస్తున్నారు. సురక్ష్ ఎంటర్టయిన్ మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.