టాస్ కూడా పడకుండానే భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 రద్దు

18-11-2022 Fri 13:43
  • వెల్లింగ్టన్ స్కై స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్
  • వర్షం వల్ల టాస్ కూడా పడని వైనం
  • డ్రెస్సింగ్ రూమ్ లకే పరిమితమైన ఆటగాళ్లు
rain delays india and newzeland 1st t20 match
భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా  తొలి టీ20 ఈ రోజు వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో షెడ్యూల్ చేశారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ మొదలవ్వాలి. కానీ, వెల్లింగ్టన్ లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా  ఆట సాధ్యం కాలేదు. కనీసం కనీసం టాస్ కూడా పడలేదు. వర్షం తగ్గితే ఐదు ఓవర్ల ఇన్నింగ్స్ చొప్పున మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు ఎదురు చూశారు. నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూమ్ లకే పరిమితం అయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఈ నెల 20న, మూడో మ్యాచ్ 22న జరుగుంది.