Gunathilaka: రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్ కు ఊరట

  • టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన గుణతిలక
  • అక్కడ ఒక మహిళపై అత్యాచారం చేసిన శ్రీలంక క్రికెటర్
  • బెయిల్ మంజూరు చేసిన సిడ్నీలోని కోర్టు
Sri Lankan Cricketer Gunathilaka gets bail in rape case

రేప్ కేసులో శ్రీలంక క్రికెటల్ గుణతిలక అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన... సిడ్నీలో అక్కడ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, ఆయనను అక్కడ అరెస్ట్ చేశారు. తాజాగా అక్కడి కోర్టులో ఆయనకు ఊరట లభించింది. సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ ఉన్న స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం ఆయన గత రెండు వారాలుగా విఫల ప్రయత్నం చేయగా... చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. 

గుణతిలకు కోర్టు విధించిన షరతులు ఇవే:

  • సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. 
  • రేప్ కు గురైన మహిళను కలిసిన టిండర్ యాప్ జోలికి వెళ్లకూడదు. 
  • కేసు పూర్తయ్యేంత వరకు ఆస్ట్రేలియాను వదిలి వెళ్లకూడదు. 
  • 1.50 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల పూచీకత్తును సమర్పించాలి. 
  • పోలీసులకు పాస్ పోర్ట్ సరెండర్ చేయాలి. 
  • రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోలీసుల నిఘా ఉంటుంది.

More Telugu News