ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బుసారపు శ్రీనివాస్ కు సిట్ నోటీసులు

17-11-2022 Thu 18:44
  • సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
  • ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
  • విచారణ కోసం సిట్ ఏర్పాటు
  • రామచంద్రభారతికి శ్రీనివాస్ విమాన టికెట్లు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు
SIT issues notice to Busarapu Srinivas
ఇటీవల నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో కొనుగోలు చేసేందుకు యత్నించిన రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 

ఈ నేపథ్యంలో, బుసారపు శ్రీనివాస్ అనే వ్యక్తికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ శ్రీనివాస్ ను ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతికి ఫ్లయిట్ టికెట్లు కొనుగోలు చేసినట్టు శ్రీనివాస్ పై ఆరోపణల నేపథ్యంలో, అతడికి సిట్ అధికారులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. బుసారపు శ్రీనివాస్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచరుడిగా భావిస్తున్నారు