back pain: వెన్ను నొప్పి బాధిస్తోందా.. ఇలా చేసి చూడండి

  • వ్యాయామం తప్పనిసరి అంటున్న నిపుణులు
  • ప్రశాంతమైన నిద్రతో సగం సమస్యలు దూరం
  • ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచన
Experts say that sitting and working for hours can lead to health problems

ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పొద్దుపోయే దాకా.. రోజులో ఎక్కువ సమయం కూర్చునే పనిచేస్తారా? అయితే, ఈ అనారోగ్యాలకు మీరు చేరువలో ఉన్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య వెన్నునొప్పి.. దీనిని చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత ప్రపంచంలో అన్ని పనులూ కంప్యూటర్ ద్వారానే జరుగుతుండడంతో సిస్టం ముందు కూర్చుని పనిచేసేవాళ్ల సంఖ్య పెరుగుతోందని నిపుణులు తెలిపారు. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరానికి తగిన వ్యాయామం లేక దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముడతాయని పేర్కొన్నారు. అందుకే నిత్యజీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

వెన్ను నొప్పితో బాధపడేవాళ్లు వ్యాయామం విషయంలో బద్దకించొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆవాల నూనెతో మసాజ్ చేస్తే వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి, ఆ నీటితో స్నానం చేసినా వెన్ను నొప్పి నెమ్మదిస్తుందని వివరించారు. ప్రశాంతంగా నిద్రపోతే చాలా ఆరోగ్య సమస్యలు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలని చెప్పారు. ఒత్తిడి ఎక్కువైతే దాని ప్రభావం శరీరం మొత్తం మీద పడుతుందని హెచ్చరించారు. ఒత్తిడి తగ్గించుకుని ఆహారంలో ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలని, చక్కెర వాడకం తగ్గించాలని సూచిస్తున్నారు.

More Telugu News