Krishna: సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం... జనసంద్రమైన రోడ్డు

Super Star Krishna Anthima Yatra
  • పద్మాలయా స్టూడియోస్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం
  • రోడ్డుకిరువైపులా కిక్కిరిసిన జనం
  • ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. పద్మాలయా స్టూడియోస్ నుంచి ఆయన పార్థివదేహం ఉంచిన వాహనం బయల్దేరింది. ఈ సందర్భంగా ఆయనను కడసారి చూసుకునేందుకు వచ్చిన అభిమానులందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. భారీ భద్రత మధ్య యాత్ర కొనసాగుతోంది. 

పూలతో అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహం ఉంచారు. ఆ వాహనం ముందు కదులుతుండగా... వెనుక ఆయన కుమారుడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితుల వాహనాలు అనుసరిస్తున్నాయి.

హైదరాబాద్ మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమక్రియలు జరగనున్నాయి. మరోవైపు, అంతిమయాత్ర కొనసాగుతున్న మార్గం మొత్తం జనసంద్రమైంది. రోడ్డుకిరువైపులా జనాలు నిలబడి కృష్ణకు వీడ్కోలు పలుకుతున్నారు. "జోహార్ కృష్ణ" అంటూ నినదిస్తున్నారు.
Krishna
Anthima Yatra
Funerals
Tollywood

More Telugu News