పద్మాలయ స్టూడియోకు కృష్ణ పార్థీవ దేహం.. కడచూపు కోసం పోటెత్తిన ప్రముఖులు, అభిమానులు
Add ap7am to your home Screen

పద్మాలయ స్టూడియోకు కృష్ణ పార్థీవ దేహం.. కడచూపు కోసం పోటెత్తిన ప్రముఖులు, అభిమానులు

Krishna  body to Padmalaya Studio
  • ఈ ఉదయం నానక్ రామ్ గూడ నుంచి స్టూడియోకు తరలింపు
  • నివాళులు అర్పించిన బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు తదితరులు
  • ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
తెలుగు తెర దిగ్గజం, సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థీవ దేహాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఈ ఉదయం నానక్ రామ్ గూడలోని ఆయన నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్లారు. పలువురు ప్రముఖులు పద్మాలయ స్టూడియోకు వచ్చి కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు కృష్ణ పార్థీవ దేహంపై పూలు చల్లి నివాళులు అర్పించారు. మరోవైపు తమ అభిమాన నటుడిని చివరి చూపు చూసి వీడ్కోలు పలికేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. 

ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. పద్మాలయ స్టూడియోస్‌ నుంచి మహాప్రస్థానం వరకూ ఊరేగింపుగా కృష్ణ భౌతికకాయాన్ని తీసుకెళ్తారు. కృష్ణ మృతికి సంతాపంగా తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగ్‌లు బంద్‌కి పిలుపునిచ్చింది. పలుచోట్ల సినిమా హాల్‌లను మూసివేశారు. మరోవైపు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు సూచనలు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు.
superstar
krishna
mahesh babu
balakrishna

More Telugu News