Chittoor District: చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Earthquake in Chittoor District
  • పది సెకన్లపాటు కంపించిన భూమి
  • 15 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు ప్రకంపనలు
  • భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు
చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ముఖ్యంగా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. 

15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. కాగా, గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే, ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదు.
Chittoor District
Earthquake
Andhra Pradesh

More Telugu News