APSBCL: ఏపీలో మరో 10 మద్యం బ్రాండ్లకు అనుమతి

APSBCL Gave Permission To Another 10 Liquor Brands
  • తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు అనుమతి
  • ఉన్న వాటి కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు అనుమతి
  • అధికారికంగా వెల్లడించని ఏపీఎస్‌బీసీఎల్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌బీసీఎల్ అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా, అదే కేటగిరీలోని మిగతా బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కొన్ని కేటగిరీల బీరు ధర రూ. 200గా ఉంది. ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల బీరు ధర రూ. 220గా ఉంది. అలాగే, కొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ. 110గా ఉంటే, ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం క్వార్టర్ ధర రూ. 130గా ఉంది.

తమిళనాడుకు చెందిన ఎస్ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కాగా, కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు, వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడం గమనార్హం.

APSBCL
Andhra Pradesh
Liquor
Liquor Brands

More Telugu News