రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెప్పిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
- బీజేపీ విమర్శలను తిప్పికొట్టే క్రమంలో ముర్ము ప్రస్తావన తెచ్చిన బెంగాల్ మంత్రి అఖిల్
- అఖిల్ వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలు
- ముర్ముకు క్షమాపణలు చెప్పిన మంత్రి
- పార్టీ తరఫున క్షమాపణ చెప్పిన మమతా బెనర్జీ
ఫలితంగా సోమవారం మరో ప్రకటన చేసిన అఖిల్ గిరి... రాష్ట్రపతిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. బీజేపీ నేతలు నిత్యం తన రూపంపై విమర్శలు గుప్పిస్తుంటే... తాను అలా అన్నానని, అయినా తాను చేసింది తప్పేనంటూ ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం మరింత ముదురుతుందని గ్రహించిన దీదీ స్వయంగా రంగంలోకి దిగారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తమకు ఎనలేని గౌరవం ఉందని దీదీ అన్నారు. అయినా ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె అన్నారు. తమ పార్టీ తరఫున ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతున్నట్లు దీదీ ప్రకటించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని ఆమె తన కేబినెట్ మంత్రిని హెచ్చరించారు.