రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం రమేశ్
- ఇటీవలే రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన సీఎం రమేశ్
- పార్లమెంటులో బాధ్యతలు చేపట్టిన బీజేపీ ఎంపీ
- ఢిల్లీలో ఎంపీల వసతి సౌకర్యాలను పర్యవేక్షించనున్న తెలుగు నేత
ఈ క్రమంలో సోమవారం పార్లమెంటులో ఆయన రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయనకు హౌస్ కమిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన రమేశ్... కమిటీకి చెందిన కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు. రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ హోదాలో ఢిల్లీలో ఎంపీలకు సర్కారీ బంగళాల కేటాయింపు, వాటి నిర్వహణ తదితర బాధ్యతలను రమేశ్ పర్యవేక్షించనున్నారు.