GVL Narasimha Rao: విశాఖలో ఇంటర్నెట్ ఎక్చేంజ్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది: జీవీఎల్

GVL says Center gives nod to internet exchange in Vizag
  • ఈ ఎక్చేంజ్ తో ఇంటర్నెట్ వేగం పెరుగుతుందని వెల్లడి
  • వివిధ రంగాల సేవలు వేగవంతమవుతాయని వివరణ
  • సోము వీర్రాజుపై జరుగుతున్న ప్రచారానికి ఖండన

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పలు ప్రాజెక్టులపై వివరాలు తెలిపారు. విశాఖలో ఇంటర్నెట్ ఎక్చేంజ్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. వచ్చే జనవరిలో విశాఖలో ఈ ఎక్చేంజ్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. 

ఈ ఎక్చేంజ్ ద్వారా ఇంటర్నెట్ వేగం, నాణ్యత పెరిగి చార్జీలు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఐటీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సర్వీసెస్ కు ఊతం లభిస్తుందని వివరించారు. రూ.106 కోట్లతో కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం జరగనుందని వెల్లడించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 

అటు, ప్రధాని మోదీ... సోము వీర్రాజును నీ పేరేంటి అని అడిగారంటూ జరుగుతున్న ప్రచారంపైనా జీవీఎల్ స్పందించారు. దీనిపై వస్తున్న కథనాల్లో వాస్తవంలేదని కొట్టిపారేశారు. ఏపీ బీజేపీ నేతలందరినీ పరిచయం చేసుకోవాలని ప్రధాని కోరడంతో సోము వీర్రాజు తన పేరు నుంచి మొదలుపెట్టారని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News