Nara Lokesh: నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు గొర్లె వేణుగోపాల్ రెడ్డి

MLA RK aide Venugopal Reddy joins TDP
  • వేణుగోపాల్ రెడ్డికి టీడీపీ కండువా కప్పిన లోకేశ్
  • పార్టీలోకి ఆహ్వానం
  • టీడీపీ ఆఫీసు నుంచి తాడేపల్లి వరకు బైక్ ర్యాలీ
  • వైసీపీలో ఆత్మగౌరవం లేక పార్టీని వీడుతున్నారన్న లోకేశ్
మంగళగిరి నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అనుచరుడు గొర్లె వేణుగోపాల్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆయన వెంట పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. 

లోకేశ్ ఇక్కడి టీడీపీ కార్యాలయంలో వేణుగోపాల్ రెడ్డికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి తాడేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 

వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరడంపై లోకేశ్ స్పందిస్తూ, వైసీపీలో ఆత్మగౌరవం లేకే చాలామంది పార్టీని వీడి బయటికి వస్తున్నారని వెల్లడించారు. గంజాయి మత్తులో తాడేపల్లి మండలం మొత్తం నాశనమైందని విమర్శించారు. మోదీ సభలో ఏపీకి కావాల్సిన ఒక్క అంశాన్ని కూడా జగన్ అడగలేదని లోకేశ్ ఆరోపించారు.
Nara Lokesh
Venugopal Reddy
RK
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News