మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి... సంతాపం ప్రకటించిన నేతలు
- బీజేపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మందాడి
- 2004లో హన్మకొండ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం
- 2009లో కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత
- అనారోగ్య కారణాలతో కన్నుమూసిన వైనం
బీజేపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మందాడి సత్యనారాయణ రెడ్డి... ఆ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీని వీడిన ఆయన టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ తరఫుననే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. మందాడి సత్యనారాయణ మృతి పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం ప్రకటించారు.