Kishan Reddy: ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి

  • అసలైన రాజకీయ ఆట ప్రారంభమైందన్న కిషన్ రెడ్డి
  • మోదీ పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమని వ్యాఖ్య 
  • ప్రధానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు సరికాదని హితవు
  • ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రానికి సంబంధం లేదని స్పష్టీకరణ
Kishan Reddy take a swipe at KCR

ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక పూర్తయిన నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ప్రారంభమైందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు కేసీఆర్ ను వదిలే ప్రసక్తేలేదని అన్నారు. 

ప్రధాని మోదీ పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సరికాదని హితవు పలికారు. గవర్నర్ ను పదేపదే అవమానించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. 

"నేను... నా కుమారుడు" అనేదే కేసీఆర్ సిద్ధాంతం అని, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని, అయితే అది సాధ్యమయ్యే పనికాదని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు.

More Telugu News