Ravindra Jadeja: భార్యకు ఎమ్మెల్యే టికెట్... మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపిన రవీంద్ర జడేజా

Ravindra Jadeja thanked PM Modi and Amit Shah
  • త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
  • బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రివాబా జడేజా
  • జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం టికెట్ కేటాయించిన బీజేపీ
  • స్పందించిన జడేజా

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్ధాంగి రివాబా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కించుకోవడం తెలిసిందే. గుజరాత్ బీజేపీ జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం టికెట్ ను రివాబాకు కేటాయించింది. దీనిపై రవీంద్ర జడేజా స్పందించాడు. 

తన భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపాడు. తన అర్ధాంగి రివాబా పట్ల నమ్మకం ఉంచి ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చారంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 

అటు, రవీంద్ర జడేజా తన భార్య రివాబాకు శుభాకాంక్షలు తెలియజేశాడు. "నువ్వు బీజేపీ తరఫున విధాన సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకోవడం పట్ల గర్విస్తున్నాను. ఇప్పటివరకు నువ్వు పడ్డ కష్టం, నీ ప్రయత్నాలు ఫలించాయి. సమాజ అభ్యున్నతి కోసం ఇకపైనా నీ కృషిని కొనసాగిస్తావని ఆశిస్తున్నాను" అంటూ జడేజా భార్యనుద్దేశించి వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News