ట్రోలర్లపై విరుచుకుపడ్డ రష్మిక మందన్న

  • కెరీర్ ఆరంభం నుంచి ద్వేషాన్ని ఎదుర్కొంటున్నానని వ్యాఖ్య
  • అభిమానులను సంతోష పెట్టేందుకు ఎంతో శ్రమిస్తున్నట్టు వెల్లడి
  • నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తానన్న పుష్ప నటి
Rashmika Mandanna hits back at trolls says its heartbreaking and demoralising

ఏ కారణం లేకుండా తనను ద్వేషిస్తూ, ట్రోల్స్ తో తనను వేధిస్తున్న తీరుపై రష్మిక మందన్న సీరియస్ గా స్పందించింది. దీనిపై తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెద్ద పోస్ట్ పెట్టింది. ‘‘గత కొన్ని రోజులు, వారాలు, లేదా నెలలు లేదా సంవత్సరాల నుంచి కొన్ని విషయాలు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. దీంతో ఇప్పుడు నా కోసం నేను మాట్లాడుతున్నాను. నిజానికి ఈ పనిని సంవత్సరాల క్రితమే చేసి ఉండాల్సింది. నేను నా కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి ఎంతో ద్వేషాన్ని ఎదుర్కొంటున్నాను. 

ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలని నేను కోరుకోవడం లేదు. అంటే దీనర్థం మీరు నన్ను ఆమోదించొద్దని, నాకు వ్యతిరేకంగా ప్రచారాన్ని వ్యాప్తి చేయమని కాదు. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు నేను నిత్యం ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు. నేను పెట్టిన శ్రమ మీకు ఎంత మేర సంతోషాన్నిస్తుందన్నదే నాకు ముఖ్యం. మీరు గర్వపడే విధంగా నేను నా వైపు నుంచి అత్యుత్తమ పనితీరును ఇవ్వడానికే కష్టపడుతున్నాను. నేను చెప్పని విషయాలపై నెట్టింట నన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు అది నిజంగా నన్ను నిరుత్సాహపరుస్తోంది. గుండెను చీల్చేంతగా బాధపెడుతోంది. 

నేను ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని కొన్ని విషయాలు నాకు ప్రతికూలంగా మారుతున్నాయి. ప్రతికూల కథనాలు ఇంటర్నెట్ లో వ్యాప్తి చెందుతున్నాయి. అది నాకు, పరిశ్రమలోనూ, బయట నా అనుబంధాలకు ఎంతో హాని కలిగిస్తుంది. నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తాను. ఎందుకంటే అవి నన్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాయి. కానీ, ఈ ప్రతికూల ప్రచారం, అసహ్యించుకోవడం వల్ల వచ్చేందేంటి?’’అంటూ రష్మిక బారెడంత పోస్ట్ తో తనను ద్వేషించే వారికి గట్టి బదులే ఇచ్చింది. (ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కోసం

More Telugu News