Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన మహిళ

Woman counter to Vallabhaneni Vamsi
  • విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో వంశీ పర్యటన
  • ఇక్కడి నుంచి ఐటీ కంపెనీలు వెళ్లిపోయాయన్న మహిళ
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బాగా చూస్తున్నట్టున్నారన్న వంశీ
  • ఆ పత్రికల వల్లే మీరు పెద్దవాళ్లయ్యారన్న మహిళ

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించిన పరిణామం ఎదురయింది. విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో ఆయన పర్యటిస్తుండగా ఒక మహిళ ఆయనను నిలదీశారు. గతంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండేవని... ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోయాయని... దీంతో యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఆమె అన్నారు. మీ ముఖ్యమంత్రి జగన్ ను అడిగి ఐటీ కంపెనీలను తీసుకురావాలని చెప్పారు. 

దీనికి సమాధానంగా... అక్కా, మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బాగా చూస్తున్నట్టున్నారని వంశీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ఆమె అదే స్థాయిలో ప్రతిస్పందించారు. ఈ పత్రికల వల్లే కదా మీరు పెద్దవాళ్లు అయిందని అన్నారు. 

దీంతో వంశీ స్పందిస్తూ ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పని చేయలేకపోతున్నారని... అందుకే చాలా కంపెనీలు వెళ్లిపోయాయని చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా... మీరు ఇంకా హైదరాబాదునే అభివృద్ధి చేయాలనుకుంటున్నారని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News