Chhattisgarh: కుమారుడు మృతి చెందడంతో కోడలికి రెండో పెళ్లి చేసిన మాజీ ఎంపీ

 former MP gets his daughter in law remarried in Chhattisgarh
  • పెళ్లయిన తర్వాత నాలుగేళ్లకు అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ కుమారుడు
  • కుమారుడితో ఒంటరిగా జీవిస్తున్న కోడలిని చూసి తట్టుకోలేకపోయిన చత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎంపీ
  • భార్య కోల్పోయిన వైద్యుడితో రెండో వివాహం చేసిన చందూలాల్ సాహు
కుమారుడు మృతి చెందడంతో జీవితాన్ని కోల్పోయిన కోడలికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు ఓ మాజీ ఎంపీ. చత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ మాజీ ఎంపీ అయిన చందూలాల్ సాహు కుమారుడు కల్యాణ్ సాహు-కల్యాణికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు అనారోగ్యం బారినపడి కల్యాణ్ మృతి చెందారు. అప్పటికే వారికి ఏడాదిన్నర వయసున్న కుమారుడున్నాడు. భర్త మృతితో కల్యాణి ఒంటరిగా మారింది. 

కల్యాణిని చూసినప్పుడల్లా చందూలాల్ మనసు విలవిల్లాడేది. ఇలా అయితే లాభం లేదని, కోడలికి రెండో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ధమ్‌తరికి చెందిన డాక్టర్ వీరేంద్ర గంజీర్ గురించి తెలిసింది. వీరేంద్ర భార్య గుండెపోటుతో మరణించడంతో ఆయన కూడా ఒంటరి జీవితం గడుపుతున్నారు. దీంతో ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వీరేంద్రను కలిసి విషయం చెప్పారు. అందుకు ఆయన కూడా అంగీకరించడంతో ధమ్‌తరీలోని వింధ్యవాసిని ఆలయంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.
Chhattisgarh
Chandulal Sahu
Virendra Ganjeer

More Telugu News