Narendra Modi: విశాఖకు వస్తున్న ప్రధాని మోదీ.. వేదికను పంచుకోనున్న సీఎం జగన్

Modi Vizag schedule finalised
  • 11వ తేదీ సాయంత్రం వైజాగ్ చేరుకోనున్న మోదీ
  • 12వ తేదీన ఏయూలో సభకు హాజరుకానున్న ప్రధాని
  • కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం జగన్
ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఈ నెల 11న సాయంత్రం మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. రాత్రికి చోళ షూట్ లో బస చేస్తారు. 12 తేదీ ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీకి చేరుకుంటారు. 

అక్కడి నుంచే రూ. 10,742 కోట్ల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు... ఇప్పటికే పూర్తయిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఉదయం 10.30 నుంచి 11.45 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరవుతారు.

ఈ కార్యక్రమం అనంతరం 12 గంటలకు విశాఖ నుంచి బయల్దేరుతారు. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని ప్రయాణించే రహదారికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
Narendra Modi
BJP
Jagan
YSRCP

More Telugu News