Jharkhand: రైల్వే ప్రయాణికురాలి బ్యాగులో విషపూరితమైన విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లు

Woman Carrying Exotic Snakes and Lizards On Train Arrested In Jharkhand
  • టాటానగర్ మీదుగా ఢిల్లీకి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
  • 29 విషపూరిత విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లు స్వాధీనం
  • బహిరంగ మార్కెట్లో వాటి విలువ కోట్లలో ఉంటుందన్న పోలీసులు
  • అటవీ శాఖ అధికారులకు అప్పగింత
రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగు నుంచి పోలీసులు విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీల సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. 52 ఏళ్ల మహిళ నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో ఝార్ఖండ్‌లోని టాటానగర్ మీదుగా ఢిల్లీకి విదేశీ పాములను తరలిస్తున్నట్టు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టాటానగర్‌లో రైలును ఆపి జనరల్ బోగీలో తనిఖీలు చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆమె వద్దనున్న బ్యాగులో 29 విషపూరిత విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తనది పూణె అని పేర్కొంది. నాగాలాండ్‌లో ఓ వ్యక్తి తనకు ఈ బ్యాగ్ ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్లాలని సూచించినట్టు పోలీసులకు తెలిపింది. రైల్వే పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న పాములు, బల్లులు, సాలీళ్లను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Jharkhand
Exotic Snakes
Lizards
Tata Nagar
Pune

More Telugu News