కేజ్రీవాల్ చెప్పేవన్నీ అబద్ధాలే..! ఆప్ చీఫ్ ఆరోపణలను కొట్టిపారేసిన బీజేపీ
- గుజరాత్ ఎన్నికలకు దూరంగా ఉంటే .. ఆప్ మంత్రులపై కేసులు మాఫీ
- బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందన్న ఢిల్లీ ముఖ్యమంత్రి
- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేజ్రీవాల్ పై మండిపడ్డ బీజేపీ
గుజరాత్ ఎన్నికలలో ఆప్ పోటీ చేయకుండా ఉంటే సత్యేందర్ జైన్, సిసోడియాలను కేసుల నుంచి తప్పిస్తామని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు. అయితే, ఈ ఆఫర్ ఎవరు ఇచ్చారనే ప్రశ్నకు కేజ్రీవాల్ సూటిగా జవాబివ్వలేదు. తన పార్టీలో ఓ నేత ద్వారా బీజేపీ ఈ ఆఫర్ ఇచ్చిందని చెప్పారు. బీజేపీ ఎప్పుడూ నేరుగా ఆఫర్ ఇవ్వదని, నలుగురు ఐదుగురి మధ్య తిరిగి చివరికి అందుతుందని ఆయన తెలిపారు.