ఇంగ్లండ్ పై టాస్ గెలిచిన శ్రీలంక... ఆస్ట్రేలియన్లందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే!
- సిడ్నీలో కీలక మ్యాచ్
- ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇంగ్లండ్ కు సెమీస్ బెర్తు
- ఇంగ్లండ్ ఓడితే ఆసీస్ కు సెమీస్ చాన్స్
నేటి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా, శ్రీలంక జట్టులో మధుషాన్ స్థానంలో కరుణరత్నేని తుదిజట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సాంక 32 పరుగులతోనూ, ధనంజయ డిసిల్వా 2 పరుగులతోనూ ఆడుతున్నారు. 18 పరుగులు చేసిన ఓపెనర్ కుశాల్ మెండిస్... క్రిస్ వోక్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు.