Cobra: బాలుడ్ని కాటేసిన కోబ్రా.. కోపంతో పామును కొరికేసిన చిన్నారి

Cobra bites 8 year old Chhattisgarh boy he bites it back twice snake dies
  • ఛత్తీస్ గఢ్ లోని జస్పూర్ జిల్లాలో జరిగిన ఘటన
  • ఆడుకుంటున్న చిన్నారి చేతికి మెలి చుట్టేసిన నాగుపాము
  • విడవకపోవడంతో కొరికేసిన చిన్నారి.. చనిపోయిన పాము

ఓ బాలుడి చేతిలో కోబ్రా ప్రాణం కోల్పోయింది. పాము కాటుతో చిన్నారులు మరణించిన వార్తలు విన్నాం కానీ, ఇప్పుడు చెప్పుకుంటున్నది దీనికి పూర్తిగా విరుద్ధమైనది. ఛత్తీస్ గఢ్ లోని జస్పూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు దీపక్ తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ నాగుపాము (కోబ్రా) అతడి చేతికి చుట్టేసుకుంది. 

దాన్ని విడిపించేందుకు దీపక్ చేయిని విదిలించాడు. దాంతో పాము కాటేసింది. ఆ తర్వాత కూడా అది ఆ చిన్నారి చేయిని విడిచి పెట్టడం లేదు. దీంతో అతడు కోపంతో చేయిని నోటి దగ్గరకు తీసుకుని పామును రెండు సార్లు కొరికేశాడు. ఈ దెబ్బకు నాగుపాము చనిపోయింది. ఇదే విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తమ కుమారుడిని తరలించారు. 

వైద్యులు యాంటీ స్నేక్ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చి, పరిశీలనలో ఉంచారు. కాకపోతే చిన్నారికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. సదరు కోబ్రా చిన్నారిని కాటు అయితే వేసింది కానీ, విషాన్ని విడుదల చేయలేదు. దీన్ని డ్రై బైట్ గా వైద్యులు తేల్చారు. ఒక రోజు పరిశీలనలో ఉంచిన తర్వాత చిన్నారిని ఇంటికి పంపించేశారు.

  • Loading...

More Telugu News