Rashmi Gautam: రష్మి ఇకనైనా సినిమాలపై పూర్తి దృష్టి పెట్టేనా?

Rashmi Special
  • బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీగా రష్మి 
  • సినిమాల పరంగా లభించిన ఫాలోయింగ్ 
  • తాజా చిత్రంగా రూపొందిన 'బొమ్మ బ్లాక్ బస్టర్'
  • ఈ నెల 4వ తేదీన సినిమా విడుదల
రష్మి .. బుల్లితెర చూసేవాళ్లలో ఈ పేరును గురించి తెలియనివాళ్లు దాదాపుగా ఉండరు. అంతగా రష్మి పాప్యులర్ అయింది. బుల్లితెరకి గ్లామర్ అద్దిన యాంకర్స్ లో రష్మి ఒకరు. యాంకర్ గా వచ్చిన తరువాతనే తెలుగుపై కాస్త దృష్టి పెట్టిన రష్మి .. ఆ తరువాత కొంతవరకూ పట్టు సాధించింది. ఆమె గ్లామర్ .. గలగలమని మాట్లాడే తీరుకు చాలామంది కుర్రాళ్లు అభిమానులుగా మారిపోయారు. 

ఒక హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఆమెకి బుల్లితెరపై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ క్రేజ్ కారణంగానే ఆమెకి సినిమాలలోను అవకాశాలు వచ్చాయి. 'గుంటూరు టాకీస్' .. 'తను వచ్చెనంట' .. 'అంతకుమించి' .. 'శివరంజని' వంటి సినిమాలు చేస్తూ వచ్చింది.  హారర్ ... రొమాన్స్ టచ్ ఉన్న పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన రష్మికి, గ్లామర్ పరంగా సినిమాల వైపు నుంచి కూడా మంచి క్రేజ్ దక్కింది.  

అయితే ఆ సినిమాలేవీ అంతగా ఆడలేదు. దాంతో ఆమె సినిమాల సంఖ్యను తగ్గించి, మళ్లీ టీవీ షోస్ పైనే దృష్టి పెట్టింది. అనసూయ మాదిరిగా రష్మి కూడా పూర్తి స్థాయిలో సినిమాల వైపుకు రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా చేసింది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇక నుంచైనా ఆమె పూర్తిగా సినిమాల దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి.
Rashmi Gautam
Nandu
Bomma Blackbuster Movie

More Telugu News