AAP: గుజరాత్ లో మెజారిటీ సీట్లు మాకే వస్తాయి: కేజ్రీవాల్ ధీమా

Arvind Kejriwal And Partys Big Numbers Claim in Gujarat Poll
  • అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో కేజ్రీవాల్ ట్వీట్
  • ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆప్ నేతల కామెంట్  
  • గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ గురువారం పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. గుజరాత్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదని అన్నారు. గుజరాత్ లోని 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

మరోపక్క, గుజరాత్ లో ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం 95 సీట్లు తమవేనని, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే కనుక 140 నుంచి 150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఆమ్ ఆద్మీకి పట్టంకడతారని భరద్వాజ్ చెప్పారు. 

ఇదిలావుంచితే, కిందటి సార్వత్రిక ఎన్నికల్లో 30 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు పోటీచేసినా.. ఎవరూ గెలవలేదు. అయితే, ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఆప్ ప్రభావం భారీగా ఉంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  
AAP
Arvind Kejriwal
Gujarat Elections
aap govt

More Telugu News