Yograj Singh: చెన్నైలో కమల్ హాసన్ ఇండియన్-2 కొత్త షెడ్యూల్... షూటింగ్ లో పాల్గొన్న క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి

Cricketer Yuvraj Singh father Yograj Singh joins Indian 2 sets in Chennai
  • కమల్ హీరోగా గతంలో భారతీయుడు
  • సీక్వెల్ గా వస్తున్న ఇండియన్-2
  • శంకర్ దర్శకత్వంలో చిత్రం
  • ఓ కీలక పాత్ర పోషిస్తున్న యోగరాజ్ సింగ్
కమల్ హాసన్ గతంలో నటించిన భారతీయుడు (ఇండియన్) చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా శంకర్ దర్శకత్వంలోనే ఇండియన్-2 రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చెన్నైలో మంగళవారం ప్రారంభమైంది. 

కాగా, ఈ సినిమాలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా నటిస్తున్నారు. తాజా షెడ్యూల్ లో ఆయనపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ నేపథ్యంలో, యోగరాజ్ సింగ్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి తాను మేకప్ వేయించుకుంటున్న ఫొటోను యోగరాజ్ సింగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇండియన్-2 సినిమా కోసం లయన్ ఆఫ్ పంజాబ్ రెడీ అవుతున్నాడంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. 

యోగరాజ్ సింగ్ క్రికెటర్ కూడా. గతంలో భారత జట్టు తరఫున ఒక టెస్టు, 6 వన్డేలు ఆడాడు. ప్రధానంగా ఆయన కుడిచేతివాటం మీడియం పేసర్. గాయం కారణంగా క్రికెట్ కెరీర్ ముగించాల్సి వచ్చింది. దాంతో ఆయన పంజాబీ సినిమాల వైపు అడుగులేశారు. తన కుమారుడు యువరాజ్ సింగ్ ను మాత్రం దేశం గర్వించదగ్గ క్రికెటర్ గా మలిచారు. క్రికెట్ లో యువీ రికార్డుల గురించి తెలిసిందే.
Yograj Singh
Indian-2
Kamal Haasan
Chennai
Kollywood
Punjab

More Telugu News