England: అలెక్స్ హేల్స్ దూకుడు... కివీస్ పై భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

  • టీ20 వరల్డ్ కప్ లో ఆసక్తికర మ్యాచ్
  • బ్రిస్బేన్ లో ఇంగ్లండ్ వర్సెస్ కివీస్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • భారీ షాట్లతో విరుచుకుపడిన హేల్స్
England eyes on huge total against Kiwis

టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ ఆసక్తికర సమరం జరుగుతోంది. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. సూపర్-12 దశలో భాగంగా జరుగుతున్న ఈ గ్రూప్-1 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 1 వికెట్ కోల్పోయి 85 పరుగులు చేసింది. హేల్స్ 40 బంతుల్లో 52 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం కెప్టెన్ జోస్ బట్లర్ 29 పరుగులతో ఆడుతున్నాడు. మొయిన్ అలీ 2 పరుగులతో ఆడుతున్నాడు.

More Telugu News