Balakrishna: బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదేనంటూ టాక్!

Balakrishna in Anil Ravipudi Movie
  • గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా 
  • ముగింపు దశకి చేరుకున్న చిత్రీకరణ 
  • సంక్రాంతికి సినిమా రిలీజ్ 
  • తదుపరి సినిమా అనిల్ రావిపూడితో 
  • లైన్లోనే ఉన్న పరశురామ్  
బాలకృష్ణ కథానాయకుడిగా ప్రస్తుతం 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ముగింపు దశకి చేరుకుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో కొనసాగుతుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది. కూతురు పాత్రకిగాను ఆల్రెడీ శ్రీలీల ఎంపిక జరిగిపోయింది. ఈ సినిమాకి 'రామారావుగారు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుంది. 

ఇక ఈ సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసే అవకాశం ఉందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ లోనే ఈ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంటులోను పరశురామ్ మాటలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయి. మొత్తానికి బాలకృష్ణ కుర్ర హీరోలకంటే ఫాస్టుగా ప్రాజెక్టులను చక్కబెడుతూ ఉండటం విశేషం.
Balakrishna
Gopichand Malineni
Anil Ravipudi

More Telugu News