రాజస్థాన్ ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్న ప్రధాని
- ప్రపంచంలో మోదీ ఎంతో గౌరవం పొందుతున్నారని వ్యాఖ్య
- అది మన ప్రజాస్వామ్యం గొప్పతనమేనన్న గెహ్లాట్
- గుజరాత్, మధ్యప్రదేశ్ సీఎంలు కూడా పాల్గొన్న కార్యక్రమం
‘‘మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనుకుని ఉంది. ప్రపంచం దీన్ని గుర్తించింది. అందుకే ఈ దేశ ప్రధాని వస్తున్నందుకు వారు గర్వపడుతున్నారు’’ అని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇదే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ నాడు బ్రిటిషర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన 1,500 మందికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ లో తీగల వంతెన కుప్పకూలిన మోర్బీ ప్రాంతానికి వెళతారు.