పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం: సీఎం జగన్
- ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
- తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జాతీయ జెండా ఎగురవేసిన జగన్
- తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద నివాళి
రాష్ట్రావతరణ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘మన సంస్కృతిని, మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను, విజయాలను, ఈ నేలపై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం’ అని ఆయన ట్వీట్ చేశారు.