Rambha: రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ సినీ నటి రంభ

Rambha meets with a car accident daughter Sasha hospitalised for treatment
  • పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళుతుండగా ప్రమాదం
  • రంభ కారును ఢీకొన్న మరో కారు
  • ముగ్గురికీ స్వల్ప గాయాలు
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి రంభ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో మంగళవారం వెల్లడించింది. సోమవారం సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి కారులో తీసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

చౌరస్తా వద్ద ఓ కారు రంభ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కారు ఫొటోను రంభ షేర్ చేసింది. స్వల్ప గాయాలతో తామంతా సురక్షితంగా ఉన్నట్టు చెప్పింది. గాయపడిన రంభ కుమార్తె సాషను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె త్వరగా కోలుకోవడానికి మీ ప్రార్థనలు కావాలని రంభ పేర్కొంది. 

రంభ ఇంతిరన్ అనే వ్యక్తితో జీవితం పంచుకోగా, మొదట ఇద్దరు కుమార్తెలు (లావణ్య, సాష) వీరికి సంతానం. ఆలస్యంగా 2018లో రంభ మగబిడ్డకు జన్మనిచ్చింది. 
Rambha
senior actress
injured
road accident
car

More Telugu News