Priyanka Chopra: మూడేళ్ల తర్వాత భారత్ కు వచ్చిన ప్రియాంక చోప్రా

Priyanka Chopra Gets Mobbed at Mumbai Airport
  • నిక్ జోనస్ తో పెళ్లయ్యాక అమెరికాలోనే సెటిలైన నటి
  • ఇటీవలే సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన నిక్ దంపతులు
  • కరోనా ఆంక్షల నేపథ్యంలో ముంబై రావడం కుదరలేదన్న ప్రియాంక
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత భారత్ కు వచ్చారు. సోమవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్టులో దిగిన ప్రియాంకకు అభిమానులు ప్లకార్డులతో స్వాగతం పలికారు. భర్త నిక్ జోనస్, కూతురుతో కలిసి ఆమె వచ్చారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్‌ ఏంజెల్స్‌లో సెటిలైన ఆమె.. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడే ముంబై వచ్చారు. 

కరోనా లాక్ డౌన్ తర్వాత దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోవడం, క్వారంటైన్ ఆంక్షల నేపథ్యంలో ముంబై రావడానికి ప్రియాంకకు ఇంతకాలం పట్టింది. ఈ టూర్ కు సంబంధించిన వివరాలను ప్రియాంక అంతకుముందే ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. బోర్డింగ్ పాస్ కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. దాదాపు మూడేళ్ల తర్వాత ఇంటికి వెళుతున్నానంటూ అందులో వ్యాఖ్యానించారు.

2017 లో బేవాచ్ సినిమాతో ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ఎంటరయ్యారు. అక్కడే నిక్ జోనస్ ను ప్రేమించి, 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి భర్తతో కలిసి ప్రియాంక లాస్ ఏంజిల్స్ లోనే ఉంటున్నారు. నిక్ జోనస్, ప్రియాంక చోప్రా దంపతులు సరోగసి పద్ధతిలో ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. భర్త, కూతురితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ.. కూతురు ముఖం కనిపించకుండా ఎమోజీలతో ప్రియాంక కవర్ చేశారు.
Priyanka Chopra
Nick Jonas
mumbai
mumbai airport

More Telugu News