గురుగ్రామ్‌లో దారుణం.. హోటల్‌లో పదో తరగతి బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం
- హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన
- బాలికను బైక్‌పై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు
- అక్కడ మరో ముగ్గురితో కలిసి అత్యాచారం
కుమార్తెను ఇంటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు నిన్నంతా ఏమైపోయావని ప్రశ్నించగా, బాలిక చెప్పింది విని హతాశులయ్యారు. తన స్నేహితులు ఇద్దరు బైక్‌పై హోటల్‌కు తీసుకెళ్లారని, అక్కడ మరో ముగ్గురితో కలిసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. విషయం ఎక్కడా చెప్పొద్దని, చెబితే చంపేస్తామని హెచ్చరించారని చెప్పింది.
దీంతో షాకైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.