గుజరాత్ లో మచ్చూ నదిపై కూలిన కేబుల్ బ్రిడ్జి... 32 మంది మృతి

Cable bridge in Gujarat collapsed and 32 people died
  • మోర్బీ ప్రాంతంలో విషాదం
  • ప్రమాద సమయంలో వంతెనపై 500 మంది
  • ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్న అనేకమంది
  • 70 మందిని కాపాడిన సహాయక సిబ్బంది, పోలీసులు
  • గుజరాత్ సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ
గుజరాత్ లోని మోర్బీలో మచ్చూ నదిపై ఉన్న ఓ కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందగా, అనేకమందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వంతెనపై 500 మంది ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నదిలో పడిన అనేకమందిని సహాయక సిబ్బంది, పోలీసులు కాపాడారు. 

ఈ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన వెంటనే చాలామంది నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఐదు రోజుల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. ప్రమాద ఘటనపై గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి స్పందిస్తూ, 70 మందిని కాపాడామని వెల్లడించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. 

కాగా, ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో మాట్లాడారు. ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

కాగా ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది 

Go Back to Shorts
Cable Bridge
Machchhu River
Morbi
Gujarat

More Telugu News