jaggery: చలికాలంలో బెల్లంతో ప్రయోజనాలెన్నో!

  • శరీరం వేడిగా ఉండేందుకు తోడ్పడుతుంది..
  • వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను అడ్డుకుంటుంది
  • జీర్ణక్రియను మెరుగు పరుస్తుందని నిపుణుల సూచన
benefits of jaggery in winter

చలికాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలన్నా, జలుబు వంటి అనారోగ్య చికాకులను దూరం పెట్టాలన్నా.. రోజువారీ ఆహారంలో బెల్లంను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్ బీ 12, బీ 6, పోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం.. మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో బెల్లం తింటే శరీరం వేడిగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకా ఇందులో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని వివరించారు. దీంతో అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. 

భోజనం పూర్తయ్యాక కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణక్రియ సులభతరమవుతుంది. జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ లకు మరింత పోషణ లభిస్తుంది. బెల్లాన్ని పాలతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. శరీరంలో యాసిడ్ స్థాయిలను నిర్వహించేందుకు బెల్లంలోని పొటాషియం, సోడియం తోడ్పడతాయి. రక్తపోటు(బీపీ) ను అదుపులో ఉంచడంలో సాయపడుతుంది.. తద్వారా హృద్రోగ వ్యాధుల నుంచి కాపాడుతుంది.

బెల్లం రోజూ తినడం ద్వారా మలబద్ధకం, కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు. ఎండార్ఫిన్ హార్మోన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని బ్యాలెన్స్ చేస్తుంది. రక్తహీనతను కూడా బెల్లం తినడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ఇక బెల్లంలో పుష్కలంగా ఉండే ఐరన్ శరీరంలోని ఎర్రరక్త కణాలను నిర్వహిస్తుంది. శరీరానికి కావాల్సిన ఆక్సీజన్ ను సరఫరా చేస్తూ రక్త కణాల విస్తరణను పెంచి, రక్తహీనతను అడ్డుకుంటుంది.

More Telugu News