టీటీడీ ఉద్యోగులకు రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు

  • అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల వాహనాల పార్కింగ్ కు షెడ్ ఏర్పాటు
  • రూ.54 లక్షలతో నిర్మాణం
  • నేడు ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి
  • టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి జగన్ కట్టుబడి ఉన్నారని వెల్లడి
YV Subbareddy says they will provide electric bikes to TTD employees on subsidy

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన హామీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించామని వెల్లడించారు. అంతేకాదు, తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు అందిస్తామని తెలిపారు. దాతలు టీటీడీకి 100 ఎలక్ట్రిక్ వాహనాలను విరాళంగా ఇచ్చారని వైవీ వెల్లడించారు. 

తిరుపతిలోని అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల వాహనాల పార్కింగ్ కోసం రూ.54 లక్షలతో పార్కింగ్ షెడ్ నిర్మించగా, ఆ షెడ్ ను వైవీ సుబ్బారెడ్డి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వివరాలు తెలిపారు.

More Telugu News