ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.. వచ్చీ రాగానే సీఈవో సహా హెడ్‌లందరిపైనా వేటు
- మస్క్ చేతికి ప్రపంచంలోనే అతిపెద్దదైన చర్చా వేదిక
- 44 బిలియన్ డాలర్లకు డీల్
- భవిష్యత్ నాగరికతకు ట్విట్టర్ చాలా ముఖ్యమన్న మస్క్
- పలు రకాల నమ్మకాలను ఇక్కడ చర్చించవచ్చన్న టెస్లా అధినేత
ట్విట్టర్ తన చేతికి వచ్చిన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సీన్ హెడ్గెట్‌లపై మస్క్ వేటేసినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘సీఎన్‌బీసీ’ పేర్కొన్నాయి. ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్టు మస్క్ నిన్న ట్వీట్ చేశారు. ట్విట్టర్‌ను తాను కొనుగోలు చేస్తున్నానని, నాగరికత భవిష్యత్‌కు ఉమ్మడి డిజిటల్ టౌన్ స్క్వేర్‌ను కలిగి ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇక్కడ పలు రకాల నమ్మకాలను ఆరోగ్యకరమైన రీతిలో చర్చించవచ్చని అన్నారు.