బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో విచారణ...హోస్ట్ నాగార్జునకు నోటీసులు
- బిగ్ బాస్ ను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్
- పిటిషన్ పై గురువారం మూడో విడత విచారణ చేపట్టిన కోర్టు
- నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
- 3 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశం
బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి లేదని... ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోను రద్దు చేయాలంటూ ఇటీవలే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటషన్ పై ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరగగా.. తాజాగా గురువారం జరిగిన విచారణలో ప్రతివాదులకు నోటీజులు జారీ అయ్యాయి. రెండు వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోర్టు... నాగార్జునతో పాటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.