Telangana: కాళేశ్వరం అవినీతిపై మాట్లాడాలంటూ రాహుల్ గాంధీకి లేఖ రాసిన వైఎస్ షర్మిల

  • కేసీఆర్ కుటుంబాన్ని కాళేశ్వరం సస్యశ్యామలం చేసిందన్న షర్మిల
  • 'కాళేశ్వరం' నిర్మాణంలో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందని వెల్లడి
  • పాదయాత్రలో కాళేశ్వరం అంశంపై స్పందించాలని రాహుల్ కు వినతి
ys sharmila writes a letter to rahul gandhi over kaleswaram project scam

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఓ లేఖ రాశారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, ఆ కుంభకోణంపై మాట్లాడాలని ఆమె రాహుల్ గాంధీని తన లేఖలో కోరారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని ఆమె అభివర్ణించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నానని రాహుల్ కు రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేస్తున్న వేళ... దేశంలోనే అతిపెద్ద కుంభకోణం గురించి మాట్లాడాలని ఆమె రాహుల్ గాంధీని కోరారు. 

ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఢిల్లీకి వెళ్లిన షర్మిల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News