Sonia Gandhi: సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వీడడంపై ప్రియాంక భావోద్వేగ స్పందన

Priyanka Vadra emotional post on her mother Sonia Gandhi left as Congress chief
  • కాంగ్రెస్ చరిత్రలో కొత్త అధ్యాయం
  • అధినేత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న సోనియా
  • నీ పట్ల గర్విస్తున్నాం అమ్మా అంటూ ప్రియాంక పోస్టు
సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్ లో మరో అధ్యాయం మొదలైంది. గాంధీ కుటుంబ సభ్యుల నుంచి పార్టీ పాలనా పగ్గాలు నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల్లోకి వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలను ఖర్గేకి అప్పగించిన 75 ఏళ్ల సోనియా గాంధీ అధ్యక్షురాలి   పదవికి వీడ్కోలు పలికారు. 

ఈ నేపథ్యంలో, సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా భావోద్వేగ భరితంగా స్పందించారు. "నీ పట్ల ఎంతో గర్విస్తున్నాం అమ్మా" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. "ఈ ప్రపంచం ఏమైనా అననీ, ఎలాగైనా అనుకోనీ.... ఇప్పటివరకు నువ్వు ప్రజల ప్రేమాభిమానాల కోసం శ్రమించావని మాకు తెలుసు" అంటూ ప్రియాంక పేర్కొన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్టుకు విశేష స్పందన వస్తోంది.
Sonia Gandhi
Priyanka Gandhi
Congress
Mallikarjuna Kharge

More Telugu News