Telangana: హోం మంత్రి కారును తనిఖీ చేసిన పోలీసులు...వీడియో ఇదిగో

ts police checks home ministerMohammed Mahmood Ali vehicle at munugode
  • మునుగోడు ఉప ఎన్నికల్లో పేలుతున్న మాటల తూటాలు
  • నేతల కార్లలో పెద్ద ఎత్తున నగదు తరలుతోందన్న ఆరోపణలు
  • బుధవారం మునుగోడు ప్రచారానికి వెళ్లిన హోం మంత్రి మహమూద్ అలీ
  • హోం మంత్రి కారును తనిఖీల కోసం ఆపిన పోలీసులు
  • పోలీసుల తనిఖీలకు పూర్తిగా సహకరించిన మహమూద్ అలీ
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ముగింపు దగ్గరపడుతున్న వేళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మునుగోడుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఆయా నేతల కార్లలో పెద్ద ఎత్తున డబ్బు తరలుతోందని ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మునుగోడుకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి మరీ పంపుతున్నారు.

ఈ క్రమంలో బుధవారం తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మునుగోడు బాట పట్టారు. ఈ సందర్భంగా నిబంధనల మేరకు హోం మంత్రి అయినా కూడా మహమూద్ అలీ కారును ఆపిన పోలీసులు దానిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులోనే కూర్చున్న అలీ స్థానిక పోలీసులకు సహకరించారు. పోలీసులు తన కారును క్షుణ్ణంగా తనిఖీ చేసే దాకా వెయిట్ చేసిన అలీ... తనిఖీలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Telangana
TS Police
Munugode
TRS
Mohammed Mahmood Ali
TS Home Minister

More Telugu News