జగన్ ను 'సీమ' టపాకాయ్ అనుకున్నాం కానీ 'చీమ' టపాకాయ్ అయ్యారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • జగన్, వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన బుచ్చయ్య చౌదరి
  • జగన్ పాలన తాటాకు టపాకాయ్ మాదిరిగా ఉందని సెటైర్
  • మంత్రులు, వైసీపీ నేతలను తారాజువ్వలతో పోల్చిన వైనం
  • వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వెలగని మతాబులన్న టీడీపీ ఎమ్మెల్యే
tdp mla gorantla butchaiah chowdary satires on ysrcp chief ys jagan and his party leaders

దీపావళి సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు సంధించారు. దీపావళి వేడుకల్లో వినియోగించే టపాసుల పేర్లను ప్రస్తావిస్తూ ఆయన మంగళవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా చతురోక్తులతో కూడిన వ్యాఖ్యలు చేశారు.


సీఎం జగన్ ను 'సీమ' టపాకాయ్ అనుకుంటే... ఆయన 'చీమ' టపాకాయ్ అయ్యారని బుచ్చయ్య చౌదరి అన్నారు. తాటాకు టపాకాయ్ మాదిరిగా తుక్కు ఎక్కువ సౌండ్ తక్కువలాగా పాలన ఉందని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక మంత్రులు, వైసీపీ నేతలు తారాజువ్వలాగాపైకి వెళ్లి కింద పడటం అలవాటుగా మారిపోయారన్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రస్తావించిన బుచ్చయ్య.. పేటీఎం కూలీల పరిస్థితి అయితే వెలగని మతాబుల లాగా ఉన్నారంటూ ఆయన సెటైర్లు విసిరారు.

More Telugu News