Kamal: కార్తి హీరోగా .. కమల్ నిర్మాతగా లోకేశ్ కనగరాజ్ మూవీ!

Karthi in Kamal movie
  • 'సర్దార్'తో హిట్ కొట్టిన కార్తి 
  • 'ఖైదీ' సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ 
  • ఈ లోగానే లోకేశ్ కనగరాజ్ తో చేసే ఛాన్స్ 
  • మరోసారి కమల్ బ్యానర్లో లోకేశ్
కార్తి కెరియర్లో చెప్పుకోదగిన సినిమా 'ఖైదీ'. సినిమా అంతా కార్తి ఒక లుంగీ .. ఒక చొక్కాతోనే కనిపిస్తాడు. అలా ఒక హీరో ఒకే డ్రెస్ తో కనిపించిన ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఖైదీ' సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ సమయం కోసమే అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. 

అయితే 'ఖైదీ' సీక్వెల్ సంగతి అటుంచితే, ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనేది కోలీవుడ్ టాక్. ఈ సినిమాకి నిర్మాత కమల్ హాసన్ కావడం విశేషం. ఆయన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. తనకి 'విక్రమ్' సినిమాతో హిట్ ఇచ్చిన దగ్గర నుంచి లోకేశ్ కనగరాజ్ పై కమల్ కి మరింత నమ్మకం ఏర్పడింది. అందువలన ఈ ప్రాజెక్టు సెట్ అయినట్టుగా సమాచారం. 

ఇక లోకేశ్ కనగరాజ్ విషయానికొస్తే విజయ్ కి 'మాస్టర్' హిట్ ఇచ్చిన ఆయన, మరోసారి విజయ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన 'ఖైదీ 2' చేస్తాడా? 'విక్రమ్ 2' చేస్తాడా? లేదంటే కమల్ బ్యానర్లో కార్తి హీరోగా సినిమా చేస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు.
Kamal
Karthi
Lokesh Kanagaraj Movie

More Telugu News